‘మార్చ్‌’ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష

శాంతి భద్రతల కోణంలో చూడొద్దు
తెలంగాణ అంశంలో గవర్నర్‌ జోక్యాన్ని కోరిన టీజేఏసీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :
టీజేఏసీ బృందం చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయడంతో ఆయన జోక్యాన్ని కోరింది. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని, దాంతో ప్రజలకు అనుకూలంగా కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని గవర్నర్‌ను కోదండరాం కోరారు. సెప్టెంబర్‌ 29న గణేశ నిమజ్జనం, అక్టోబర్‌ 1న అంతర్జాతీయ జీవి వైవిధ్య సదస్సు ప్రారంభం నడుమ సెప్టెంబర్‌ 30న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను టీజేఏసీ వాయిదా వేసుకుంటుందా అని కోదండరాంను గవర్నర్‌ ప్రశ్నించగా అది అసాధ్యమని కోదండరాం బదులిచ్చినట్లు సమాచారం. మార్చ్‌ ప్రశాంతంగా సాగుతుందని, ఈ కార్యక్రమాన్ని శాంతిభద్రతల కోణంలో కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోణంలో చూడాలని గవర్నర్‌కు కోదండరాం విజ్ఞప్తి చేశారు.