మార్చ్‌ భయంతో సచివాలయానికి

రెండు రోజుల తాళం
రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి
144 సెక్షన్‌ .. నిషేధాజ్ఞలు అమలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) :
రాష్ట్ర సచివాలయానికి రెండు రోజులు తాళం పడనుంది. దీనికి ఈనెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌ భయమే కారణం. రాష్ట్ర చరిత్రలో ఒక ఉద్యమం కారణంగా సచివాలయానికి సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం మాత్రం మార్చ్‌ కారణంగా దాడులు జరిగే అవకాశమున్నందునే రెండు రోజులు సెలవులిచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకొస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సచివాలయం ప్రాంగణంలో ఐదుగురు గుమికూడకుండా ఉండేందుకు 144 సెక్షన్‌ను విధించింది. ఆ రెండు రోజు సీఎంఓ సిబ్బంది సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తారు. అంతేగాకుండా, అసెంబ్లీ, సచివాలయం దగ్గర కేంద్ర బలగాలను మోహరించింది. అంతే కాకుండా వచ్చే నెల 1న ప్రారంభం కానున్న జీవవైవిధ్య సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన వీఐపీలు, వీవీఐపీలకు, సీమాంధ్ర నాయకుల ఇళ్లకు భారీ భద్రత ఏర్పాటు చేసింది.