మావోయిస్ట్‌ నేత ఆజాద్‌ భార్య అరెస్టు

వరంగల్‌ : మావోయిస్టు నేత ఆజాద్‌ భార్య పద్మక్క అలియాస్‌ సీతక్కను ఆదివారం ఖానాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చేందుకు వరంగల్‌ తరలించారు. అయితే సీతక్కను రెండు రోజుల కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. సీతక్కను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు శనివారం డిమాండ్‌ చేయడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే పోలీసులు మాత్రం ఆదివారం అరెస్టు చేసినట్టుగా ధ్రువీకరించారు.