మిడ్‌మానేరు రాష్టాన్రికే గుండెకాయ లాంటిది
– ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు
– కాంగ్రెసోళ్లు 25యేళ్లలో చేయలేని పనిని మూడేళ్లలో చేసిచూపించాం
– మరో మూడునెలల్లో ప్రాజెక్ట్ ను జాతికిఅంకితం చేస్తాం
– ఎస్‌ఆర్‌ఎస్పీ ఆయకట్టుకు ఈ రబీలో పూర్తిస్థాయిలో నీరందిస్తాం
– అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు వెల్లడి
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): మిడ్ మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్టాన్రికి గుండెకాయలాంటిదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. రూ.461 కోట్ల పనులతో 10 టీఎంసీల నీటినిల్వ కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఐదున్నర టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉందన్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో 18 మండలాలకు మిడ్‌మానేరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరు అందుతుందన్నారు. 1993లో పీవి నర్సింహారావు హయాంలో ఈ మిడ్‌మానేరు ప్రాజెక్టును ప్రారంభించటం జరిగిందని తెలిపిని మంత్రి 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని చెప్పారు. 2006లో జలయజ్ఞంలో భాగంగా టెండర్లు పిలిచారని, అప్పటి నుంచి 2014వరకు రూ. 1600కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిఉంటుందని హరీష్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోని ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో మట్టిపని 46లక్షల క్యూబిక్ విూటర్లు జరగగా.. తెరాస హయాంలో 77లక్షల క్యూబిక్ టర్లు పని జరిగిందన్నారు. కాంట్రీక్ట్ పని మొత్తం 4.80లక్షల క్యూమిట్ విూటర్లు చేయాల్సి ఉంటే కాంగ్రెస్ హయాంలో 50వేల క్యూబిక్ విూటర్‌లు పనులు జరిగితే, తెరాస అధికారంలోకి వచ్చే మూడేళ్ల కాలంలో 4.10లక్షల కాంక్రీట్ పనులు చేపట్టామని పేర్కొన్నారు. 3,200 మెట్రిక్ టన్నుల గేట్లు కూడా రెడీ అయ్యాయని, వచ్చే రెండుమూడు మాసాల్లో గేట్లు కూడా బిగించి మిడ్‌మానేరు ప్రాజెక్ట్ కు అంకితం చేస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ప్రాణాళికలో లోపాలు ఉండటం వల్ల ఆలస్యమైందని హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టె నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ. 639కోట్లు కాగా.. ఎల్‌ఏ ఆర్‌ఆండ్‌ఆర్ రూ. 1771కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు ఈ ప్రాజెక్టును గుండెకాయగా భావించి మమ్మల్ని సన్నద్ధం చేయటం జరిగిందన్నారు. మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అదేవిధంగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలకు తాగు నీరందుతుందని వెల్లడించారు. తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే డిసెంబర్ నుంచి మిడ్‌మానేర్‌తో 466 గ్రామాలకు తాగునీరు.. మానకొండూరు నియోజకవర్గంలోని 48,731 ఎకరాలకు సాగునీరందిస్తమని, కాల్వల పనులు కూడా పూర్తవుతున్నాయని 2018లో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందిస్తామని హరీష్ వెల్లడించారు. అదేవిధంగా మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడిచెరువుకు నీరు, చొప్పదండి నియోజకవర్గంలో 5 వేల ఎకరాలకు
సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి మిడ్‌మానేరుకు ఐదు టీఎంసీలు తీసుకుపోయిందని, మాకు తక్కువపడ్డాయి అని జీవన్‌రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు తాగునీరు ఇవ్వటమే నేరమన్నట్లు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. సింగూరులో 29.5టీఎంసీల నీరు ఉందని, సింగూర్ ప్రాజెక్టు నుండి నిజాంసాగర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీని నింపి ఈ రబీలోనే ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా నీరు ఇచ్చితీరుతామని హరీష్‌రావు స్పష్టం చేశారు.



