మిస్టరీగా మారిన పోస్టల్‌ నగదు మాయం విజయనగరం,

జూలై 18 : కోటగండ్రేడు బ్రాంచి పోస్టాఫీసుకు వచ్చిన డబ్బుల్లో రూ.40వేలు లేకపోవడం మిస్టరీగా మారింది. కోటగండ్రేడు ఎస్‌వో ఎప్పటిలాగే ఆరు లక్షల రూపాయలు డ్రా చేశారు. అయితే రూ.500 కట్టలకు బదులు 100 రూపాయల నోట్ల కట్టలు రావడంతో ఈ నష్టం జరిగినట్లు పోస్టుమాస్టారు వాపోయాడు. రూ.40వేల ఎలా మాయమయిందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి చోద్యం జరగడం వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.