ప్రజా తీర్పును గౌరవిస్తాం

 

 

 

 

 

నవంబర్ 14(జనంసాక్షి)బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార ఎన్డీయే  అక్కడ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. అంటే మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. కానీ ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ కేవలం 49 స్థానాల్లో మాత్రమే లీడ్‌ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీహార్‌ ఎన్నికల ఫలితాల సరళిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య తిరిగి వెళ్తుండగా మీడియా పలుకరించింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గుర్తుచేసింది. దాంతో ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. అనంతరం నెహ్రూ గురించి ఆయన మాట్లాడారు. దేశం కోసం నెహ్రూ ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.

నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను రూపొందించి దేశాభివృద్ధి కోసం కృషిచేశారని సిద్ధరామయ్య చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలోనూ నెహ్రూ చేసిన కృషిని మరువలేమని అన్నారు.