జూబ్లీహిల్స్‌లో హోరాహోరీ

 

నవంబర్ 14(జనంసాక్షి)జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది. మొదటి రౌండ్‌లో షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓట్లను లెక్కించగా.. కాంగ్రెస్‌ పార్టీ 8,926 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్‌ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి.

ఇక పోస్టల్‌ బ్యాలెట్ల విషయానికొస్తే కాంగ్రెస్‌కు 47 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 43 ఓట్లు రాగా.. బీజేపీకి కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి.