ముంబయిలో తొలి ‘సోషల్‌ మీడియా హబ్‌’

ముంబయి : ఫేస్‌బుక్‌ ,ట్విట్టర్‌, యూట్యూబ్‌ లాంటి సోషల్‌ మీడియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి దేశంలోనే తొలి సోషల్‌ మీడియా హబ్‌ ముంబయిలో శనివారం ప్రారంభమైంది. నేటి యువతరం ఎలాంటి విషయాలను చర్చిస్తోందో తెలుసుకోవడానికి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని తద్వారా వాటికి, పోలీసులు సేవలక మధ్య అంతారాన్ని తుడిచివేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని పోలీసులు హర్షం వ్యక్తంచేశారు. 24 గంటలూ నిర్విరామంగా పనిచేసే ఈ ల్యాబ్‌ని పోలీస్‌ కమిషనర్‌ సత్యపాల్‌ సింగ్‌ ప్రారంభించారు. సెన్సార్‌షివ్‌ విధించడం ల్యాబ్‌ ఉద్ధేశం కాదని, చర్చ జరుగుతున్న అంశాల విశ్లేషణ మాత్రమే ఇక్కడ జరుగుతుందని ఆయన తెలిపారు. రిలయెన్‌ ఫౌండేషన్‌ నిధులతో నాస్కామ్‌ సాంకేతిక సహకారంతో ఈ ల్యాబ్‌ పనిచేస్తుంది.