ముంబయి ఘటనలను ప్రధానికి వివరించిన పృథ్వీరాజ్‌

న్యూఢిల్లీ:  ముంబయి నగరంలో ఆజాద్‌మైదాన్‌లో రజా అకాడమీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన అల్లర్ల ఘటనలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వృథ్వీరాజ్‌ చవాన్‌ వివరించారు. అనంతరం విలేకరులతో చవాన్‌ మాట్లాడుతూ ముంబయి అల్లర్ల సమాచారాన్ని ప్రధానికి తెలిపినట్టు వెల్లడించారు. ఈ అల్లర్లపై ఇంటలిజెస్స్‌ విచారణను కూడా కోరినట్టు ఆయన వెల్లడించారు. మయన్మార్‌, అసోంలలో మైనార్టీలపై దాడులకు నిరసనగా శనివారం ముంబయిలో రజా అకాడమీ శనివారం నిర్వహించిన ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.