ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ నేతల బృందం

హైదరాబాద్‌ : ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్శీ నేతల బృందం ఈరోజు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. మసీదులు, చర్చిలు, గురుద్వారాల మరమ్మత్తులకు 15కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల పిల్లలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా హస్టళ్లు నిర్మించి, ఉపకార వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తరహలోనే మైనారిటీలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని కోరినట్లు చెప్పారు.