ముఖ్యమంత్రివి పగటికలలు:భాజపా
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని భారతీయ జనజా పార్టీ విమర్శించింది. ప్రజా సంక్షేమాన్ని మరచిన కిరణ్ రెండేళ్ల పాలన మూడు అలకలు, ఆరు బుజ్జగింపులుగా సాగిందని భాజపా నేత కె. లక్ష్మణ్ అన్నారు. తాజాగా మెట్రో రైలు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి గైర్హాజరు కావడం ఆ పార్టీ నేతల్లోని అనైక్యతకు అద్దం పడుతోందని లక్ష్మణ్ చెప్పారు. విద్యుత్ చార్జీల భారం ప్రజలు మోయక తప్పదన్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో ఓటమి కూడా తప్పదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రచారం కోసం ఇందిరమ్మ బాట పట్టిన ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేకతతో ఇంటిబాట పట్టడం ఖాయమన్నారు.



