ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మెజారీటీ ప్రజల మద్దతు కావాలని మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వివేక్‌ స్పష్టం చేశారు. 2009లో సీపీఎం. ఎంఐఎం తప్పా అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టాయని ఆయన గుర్తు చేశారు.