ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆల్‌ ఔట్‌ : తెలంగాణ తెదేపా

హైదరాబాద్‌: కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఒక్కో వికెట్‌ పడిపోతూ చివరకు ఆలవుట్‌ అయ్యే పరిస్థితి నెలకొందని తెలంగాణ తెదేపా నేతలు విమర్శించారు. వరంగల& ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. గుండె సంబంధిత వ్యాదులకు సాయాన్య వైద్యులే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే ఎంజీఎం ఆసుపత్రికి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్‌ చశారు.