ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ప్రయాణంపై అదికారుల తర్జనభర్జన

విజయవాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. వీరులపాడు, జయంతిలలో పర్యటించేందుకు సీఎం గుడివాడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్నారు. అయితే జయంతిలో హెలికాఫ్టర్‌ ల్యాడింగ్‌కు స్థలం అనువుగా లేదని అధికారులు తేల్చారు. దీంతో సీఎం హెలికాప్టర్‌ ప్రయాణంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.