ముగిసిన అఖండ హరినామ సప్తహం.

share on facebook

జనం సాక్షి రూరల్ నవంబర్ 22
నిర్మల్ జిల్లా బైంసా మండలం చుచుంద్ గ్రామ సద్దేశ్వర ఆలయ ప్రాంగణంలో అఖండ హరినామ సప్తాహం వేడుకలు మంగళవారంతో ముగిసాయి. ఏడు రోజులపాటు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సప్తహ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భైంసా చుట్టుపక్కన గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశరథ్ మహారాజ్ ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఈ సప్తహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Other News

Comments are closed.