ముగిసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో  పలువురు  సినీప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రవికిశోర్‌ ప్యానళ్ల మధ్య జరిగిన  ఈ ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ఫిలిం ఛాంబర్‌ వద్ద కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొందరి సినీ పెద్దల జోక్యంతో పరిస్థితి సద్ధుమణిగింది.