ముగిసిన రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడి

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలకు ఏసీబీ కస్టడీ గడువు ముగిసింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల క్రితం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించారు. అనంతరం నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు