ముగిసిన శ్రీరాములు ఏసీబీ విచారణ

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే శ్రీరాములు ఏసీబీ విచారించింది. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో సుమారు ఆరు గంటలకు పైగా శ్రీరాములును విచారించి కీలక సమాచారాన్ని రాబట్టింది. దర్యాప్తులో భాగంగా అవసరమైతే మరోసారి విచారిస్తామని శ్రీరాములుకు ఏసీబీ సూచించింది.