ముగ్గురు విద్యార్థినుల ఆదృశ్యం

హైదరాబాద్‌: అంబర్‌పేటలో అర్చన, నిఖిత, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. గత రెండు రోజులుగా వీరు కనపడకపోవడంతో వారి తల్లిదండ్రులు నిన్న రాత్రి అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విద్యార్థినుల సైకిళ్లు, బ్యాగ్‌లు ఓయూ క్యాంపస్‌లో లభ్యమయ్యాయి. వీరు పట్టపర్తిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.