మునుగోడులో తెరాస గెలుపు

బిచ్కుంద తెరాస పార్టీ శ్రేణుల సంబరాలు
బిచ్కుంద నవంబర్ 06 (జనంసాక్షి) మునుగోడు ఉపఎన్నికలో అధికార పక్షం ముందంజలో కొనసాగుతోంది. దీనితో గెలుపు ఖాయమని ఫిక్స్ అయిన తెరాస పార్టీ శ్రేణులు, బిచ్కుంద, మద్నూర్ కొడప్గల్ పాటు దేవాడ, సీతారాంపల్లి, వాజిద్నగర్ తదితర గ్రామాలలో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. సంబరాల్లో నాల్చర్ బాలు, మల్లికార్జున్ పటేల్, బస్వరాజ్ పటేల్ మరియు ర్యాల గంగారెడ్డి, ముఖీద్, ధన్సింగ్, బొమ్మల లక్ష్మణ్ తెరాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు