ములాయంపై విచారణ కొనసాగుతుంది: సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను సవాలు చేస్తూ ములాయం దాఖలుచేసిన  పిటిషన్‌ను ధర్మాననం తోసిపుచ్చింది. ఈకేసులో స్వతంత్ర దర్యాప్తు  కొనసాగించాలని సీబీఐను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ములాయం కోడలు డింపుల్‌కు మాత్రం ఈ కేసు నుంచి మినహాయింపు ఇచ్చింది.