మృతుని కుటుంబాలకు అండగా ఉంటాం
నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి
వనపర్తి బ్యూరో అక్టోబర్ 06 (జనంసాక్షి)
మృతుని కుటుంబానికి ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి భరసాను ఇచ్చారు. పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావు పల్లి గ్రామంలో శుక్రవారం మగురాయి మహేష్ మృతి చెందాడు . విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి మృతుని నివాస గృహం వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం ను అందచేశారు . కండ్ల ముందు ఉంటూ అకాల మరణం చెందడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని భగవంతుడు వారికి మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట గ్రామ బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.