మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షానికి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాళాలపై అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లే నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అతలాకుతలమయ్యారన్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలు తొలగించి, నాళాలను వెడల్పు చేయాలని కోరారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని దత్తాత్రేయ అన్నారు.