మేడం దయ ఉంటే సీఎంనైత :డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. డిచ్‌పల్లిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమల్లో పాల్గొన్నారు. ఆగస్టులోపు ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తీసువస్తామని, లేకుంటే  రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. విద్యాతోనే సమాజంలో మార్పు వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.