మొక్కలు నాటిన విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌ : ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 200 మొక్కలను సోమవారం నాటారు. ఈ 200 మొక్కలకు త్రిగార్డ్‌ను కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సోమారపు వెంకటేశ్వర్లు , కార్యదర్శి మేడిశెట్టి శ్రీనివాస్‌, కోశాధాకారి మెతుకు బాలకిషన్‌, లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, సహాయ అధ్యక్షుడు డాక్టర్‌ , డాక్టర్‌ ఎంఎల్‌ఎల్‌.రెడ్డి, డాక్టర్‌ ఆంజనేయులు, అశోక్‌, కుమారస్వామి, రామనాథం, సతీష్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.