మోపిదేవికి కూడా న్యాయసహాయం అందించాల్సిందే: పీసీసీ అధినేత బొత్స

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాల్సిందేనని పీసీసీ అధినేత బొత్ససత్యనారాణ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఆయన తెలియజేశారు. వివాదాస్పద జీవోల వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు సబిత, ధర్మాన, గీతారెడ్డి, కన్నాలకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బొత్స పై వ్యాఖ్యలు చేశారు.