మోపిదేవి బెయిల్‌ పిటీషన్‌పై విచారణ 7కి వాయిదా

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసు నిందితుడు మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటీషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మోపిదేవి బెయిల్‌పై  అభ్యంతరాలను తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు  జారీ చేసింది.