మోసపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి..
ఆర్థిక నేరగాడు చందర్ ను అరెస్ట్ చేయాలి..
బి.ఎస్.పి జిల్లా ఇంచార్జి అశోక్,
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1
రామగుండం ఎరువుల కర్మాగారంలో మోసపోయిన బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని డీఎస్పీ పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాతంగి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టి రామగుండం ఎమ్మెల్యే కోర్ కంటి చందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన అశోక్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గల ఎరువుల కర్మాగారం (ఆర్ ఎఫ్ సి ఎల్) లో పని చేయుటకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పెట్టిస్తామని, ఎమ్మెల్యే చందర్ అనుచరులు సుమారుగా 700 మంది వద్ద 7 లక్షల నుండి 14 లక్షల వరకు వసూలు చేసి, అమాయకులైన యువకులను మోసం చేశారని, మనస్థాపానికి శంకరపట్నం మండలం అంబాలపూరు గ్రామానికి చెందిన ముంజ హరీష్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందేనని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫై, అతని అనుచరులుగా చలామ