మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం – బ్యాడ్మింటన్‌ కు యాంగ్‌ గుడ్‌ బై అభిమానులకు క్షమాపణలె చెప్పిన ఫెఢరేషన్‌

లండన్‌ ఆగస్టు 2 : లండన్‌ ఒలింపిక్స్‌ సంచలనం సృషించిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను కుదిపేస్తోంది.ఈ వివాదానికి కారణమైన ఎనిమిది మంది ప్లేయర్ల పై ఇప్పటికే అనర్హత వేటు పడింది.ఇదే తన చివరి టోర్ని గి ప్రకటించింది. గుడ్‌బై బ్యాడ్మింటన్‌ .. గుడ్‌ బై బ్యాడింటన్‌ వరడ్డ్‌ ఫెడరేషన్‌ …అంటూ తన బ్లాగ్‌ లో ఆమె పోస్ట్‌ ఉంచింది.
కానీ ఫిక్సింగ్‌ వివాదానికి సంబంధించి ఆమె తన వైఖరి ని సమర్థించుకుంది. కేవలం నిభందనలను ఫార్మేట్‌ మార్చి వేశారని వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌ మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లలో నాలుగ జట్ల ఆటతీరు ఫిక్సింగ్‌ దూమారానికి కారణమైంది. గ్రూప్‌ స్టేజ్‌లో మ్యాచ్‌లలో ఫలితం ద్వారానే కార్వర్టర్‌ ఫైనల్‌ లో ప్రత్యర్థులు నిర్ణయించబడతారు. దీంతో చైనా, దక్షిణ కొరియా , ఇండోనేషియా మహిళల డబుల్స్‌ క్రీడాకారిణులు ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లలో ఉద్దేశపూర్వకంగా తమ స్ధాయి కంటే తక్కువ ప్రదర్శన చేశారు. మహిళల డబుల్స్‌లో వరల్డ్‌ ఛాంపియన్స్‌ చైనాకు చెందిన వాంగ్‌ జియోలి, యుయాంగ్‌,కిరియా ప్లేయర్స్‌ జంగ్‌ క్యున్‌ , కిమ్‌ హనా పదే పదే నెట్‌కు కొట్టడం అనుమానస్పదంగా మారింది. మ్యాచ్‌ అంపైర్‌ , టోర్నమెంట్‌ రిఫరీ హెచ్చరించినా ఫలితం లేకపోయింది.జడ్జిలతో పాటు ప్రేక్షకులు వీరి ఆటతీరు పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో చైనా 21-14, 21-11 తేడాతో ఓడిపోయింది.
కాసేపటికే దక్షిణకొరియా , ఇండోనేషియా మధ్య జరిగిన మరో ప్రీ క్వార్టర్స్‌ లో కూడా ఇదే తరహా తప్పిదాలు రిపిట్‌ అవడంతో అనుమానాలు తలెత్తాయి.దీనిపై జ్వాల జొడి ఫెడరేషన్‌ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం లేకపొయింది. మరోవైపు ఈ మొత్తం వివాదానికి సంభందించి వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చెప్పింది. అభిమానులతో పాటు ఆటగాళ్ళకు, ఆటకు కూడా అపాలజీ చెప్పింది. ఇలాంటి వివాదాలు రిపీట్‌ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది. అటు చైనా అధికారుల కూడా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఆట పట్ల గౌరవాన్ని తగ్గించేస్తాయని చైనా చీఫ్‌ యాంగ్‌ బే అన్నారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం ప్లేయర్లకు సానుభూతి చూపిసున్నారు. వారు కేవలం మేనేజ్‌మెంట్‌ చెప్పినట్టు నడుచుకున్నారని వ్యాఖ్యానిసున్నారు.