యంజాల్ లో వినాయకుడి వద్ద అన్నదానం నిర్వహించిన నాయకులు

:శామీర్ పేట్, జనం సాక్షి :
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఇగ్ నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్
సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద భీమిడి రాజిరెడ్డి మరియు కుమారులు మహిపాల్ రెడ్డి,జైపాల్ రెడ్డి(తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) వినాయకునికి పూజా చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్,మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,కాంగ్రెస్,బిజెపి, టిఆర్ఎస్ పార్టీల నాయకులు,పలు యూత్ అసోసియేషన్ల సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
4ఎస్పీటీ -1: అన్నదానం లో పాల్గొన్న నాయకులు