యంజాల్ లో శ్రీ కృష్ణాష్టమి

వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి :
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తూముకుంటమున్సిపాలిటీ పరిధి దేవరయంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,సెంట్ మేరీ స్కూల్,దక్ష స్కూల్,విద్యార్థుల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చైర్మన్ పన్నాల సుధాకర్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్య క్రమంలో దేవరయంజాల్ మాజీ ఎంపీటీసీ భీమిడి జైపాల్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు డాక్టర్ సింగం రామారావు,రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహారెడ్డి,ఆలయ పూజారి సీతారామచార్యులు,ఆలయ క్లార్క్ వసంత్,తదితరులు పాల్గొన్నారు.
20ఎస్పీటీ -1: సాంస్కృతిక కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులు