యాజమాన్య కోటా సీట్ల భర్తీ అన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్‌: ఇంజీనిరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై హైకోర్టు తీర్పును వెలువరించింది. యాజమాన్య కోట సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ విధానం ఈ ఏడాదికి చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ తర్వాత జారీ అయిన జీవో 66, 67 ఈ ఏడాదికి వర్తించవని స్పష్టం చేసింది.