యాజమాన్య సీట్ల భర్తీపై నేడు డిప్యూటీ సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ సమీక్ష సమావేశ నిర్వహించనున్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రతిభ ఆధారంగా యాజమాన్య సీట్ల భర్తీ తదితర అంశాల పై ఈ సమావేశంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో సీట్లు భర్తీ చేసే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.