యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:  అమీర్‌పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్‌ ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 12 లక్షల విలువైన 9 కంప్యూటర్లతోపాటు  ప్రింటింగ్‌ సామగ్రి కూడా కొంత దగ్ధమైంది.ఈ సంఘటనను గమనించిన ఓ ఉద్యోగి కార్యాలయం నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డాడు. ఆదివారం సెలవుదినం కావడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరు.ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించినా గంట తర్వాత తీరికగా వచ్చారని ఏజెన్సీ యజమాని వాపోయారు. రోడ్డుపై వాహనాల రద్దీ కారణంగా కొంత ఆలస్యమైందని…తను సాధ్యమైనంత వేగంగానే వచ్చామని అగ్ని మాపక అధికారి. తెలిపారు.