యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ కవిత ఉన్నారు .