యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి ముగ్గురు కొట్టుకు పోయారు. వీరిలో తాతారావు సురక్షితంగా బయటకు రాగా, మరోయువకుడు గ్లల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు, అధికారలు, గాలింపు చర్యలు చేపట్టారు. రాము మృత దేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు.