యువకిరణాలద్వారా ఇకపై ఎక్కువ వేతనాల ఉద్యోగాలు: కేసీ రెడ్డి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాల ద్వారా ఇకపై ఎక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పించేందుకు సదరు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని రీమ్యావ్‌ ఛైర్మన్‌ కేసీ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలో ఇవాళ రాజీవ్‌  యువకిరణాలు పధకం అమలు పై ప్రజాహితం నిర్వహించారు. ఇప్పటివరకు యువకి రణాలు పథకం ద్వారా తక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలే ఇప్పించామని ఆయన అంగీకరించారు. గడిచిన 14 మాసాల్లో 5104 జాబ్‌ మేళాల ద్వారా 2.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు, లోపాలను అధిగమిస్తూ  పథాకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని స్నష్టం చేశారు.