యూపీఏకు నితీష్‌ ఆఫర్‌

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మా మద్దతు
న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) :  బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యూపీఏకు బంపర్‌ ఇచ్చారు. నరేంద్రమోడీ అభివృద్ధి నినాదానికి దీటుగా పురోగతిలో అందర్ని కలుపుకుపోయే వాస్తవిక నమూనాగా తమ రాష్ట్రం రాణిస్తోందని తెలిపారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఏర్పాటుకు తమ మద్ధతు కీలకమనే సంకేతాన్ని ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే పార్టీకే మా మద్ధతు ఇస్తామని పేర్కొన్నారు. బీహార్‌ పాలకపక్షం జేడీ         ( యూ ) బలప్రదర్శనకు నిదర్శనం అన్నట్లుగా దేశరాజధానిలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడి పోతున్న తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. మేం అందర్ని తోసిరాజంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతామని అన్నారు. ప్రపంచం ముంగిట ఒక నమూనా ఉంచుతామని చెప్పారు. ఈ రోజుల్లో అభివృద్ధి నమూనాపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇదే భారత్‌కు అసలైన నమూనా అని తెలిపారు. నరేంద్రమోడీ చెబుతున్నట్లు గుజరాత్‌ మోడల్‌ కాదని తెలిపారు.