యూపీఏలోనే కొనసాగుతాం
న్యూఢిల్లీ: యూపీఏలోనే కొనసాగనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌కు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి లేఖరాశారు. కేంద్రంలో కీలక వ్యక్తి శరద్‌పవార్ అని మన్మోహన్ ప్రకటించిన అనంతరం పవార్ లేఖ రాయడం విశేషం. ఎస్‌సీపీను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా పవార్, ప్రపుల్ పటేల్ రాజీనామాలపై కాంగ్రెస్‌లో కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. త్వరలో చేపట్టనున్న కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై మన్మోహన్, సోనియాగాంధీలు చర్చించినట్టు సమాచారమందింది.