యూపీఏ నుంచి తప్పుకుంటాం – దీదీ బెదిరింపు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ మరోసారి యూపీఏ సర్కార్‌కు ఝలక్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న మమత యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది,. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభ్వుత్వంలో ఏడుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు ఉన్నారు. వారంతా ఇప్పటికే తమ రాజీనామాలను మమతా బెనర్జీకి సమర్పించినట్టు సమాచారం.