యూపీలో కొనసాగుతున్న ఆందోళన

లక్నో: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటాల అంశంపై ఉత్తరప్రదేశ్‌లో నిరసన ఆందోళన కొనసాగుతోంది. దాదాపు 18 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. లక్నోలో పలు కార్యాలయాలకు తాళాలు వేశారు. మరోపక్క రిజర్వేషన్లను సమర్థించేవారు కార్యాలయాల ఆవరణలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందితే ఆందోళన మరింత ఉద్థృతం చేస్తామని సర్వజనహిత సమితి ప్రకటించింది.