రంజాన్ ఘనంగా నిర్వహిద్దాం
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,జూన్ 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగను అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వచ్చే నెలలో ముస్లిం మతస్తులు జరుపుకోనున్న రంజాన్ పండుగ సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖంరావు సవిూక్ష నిర్వహించారు. ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులతో, ముస్లిం పెద్దలతో చర్చలు జరిపారు. ఈద్గాలు, మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫున 26న ఇఫ్తాం విందు ఇవ్వనున్నారు. అలాగే ముస్లిం సోదరులకు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తాం విందు నిర్వహించాలని తెలిపారు. ఈనెల 26న నిజాం కాలేజీ గ్రౌాంలో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తాం విందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, మత పెద్దలు, రాయబారులు, కాన్సూలేట్లను ఆహ్వానించాలని పేర్కొన్నారు. తాను కూడా నిజాం కాలేజీ మైదానంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. 26నే రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తాం విందులు జరగాలని చెప్పారు. గతేడాది మాదిరిగానే జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలను కలెక్టర్లే సమన్వయ పరచాలన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రెండు లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17 నుంచి 22 వరకు హైదరాబా’లోని వంద ప్రాంతాల్లో, జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. మదర్సాలు, అనాథశరణాలయాల్లో కూడా బట్టల పంపిణీ ఉంటుదని తెలిపారు. పండుగ రోజు ముస్లిం ప్రార్థనా స్థలాల వద్ద మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రంజాన్ ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు.