రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యం పెంచుతాం

హైదరాబాద్‌ : రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యన్ని పెంచుతామని రక్షణ శాఖ సహయమంత్రి పల్లంరాజు తెలిపారు. బాలానగర్‌లో జలంతర్గాములకు అవసరామయ్యే విడి పరికారాల తయారి యూనిట్‌ని ఎన్‌. ఇ. సి పరిశ్రమలో అయన లాంఛనంగా ప్రారభించారు. ఇప్పటికే రక్షణ, వాయు సేనలకు అవసరమయ్యే విడిభాగాలను అందిస్తున్న  ఎన్‌. ఇ. సి సంస్థ ఇకనుంచి జలాంతర్గాములకు పనికొచ్చే విడి పరికారాలు తయారు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ప్రముఖ రక్షణ పరికారాల సంస్థ డిసిఎస్‌ఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నాటికి 20 వేల కోట్ల రూపాయాలతో ఆరు జలంతర్గాములను వినియోగంలోకి తీసుకువస్తున్నట్లుగా పల్లంరాజు తెలిపారు. ప్రస్తుతం రక్షణ వ్యవస్థకు అవసరమయ్యె ముడి పరికారాలన్నీ దిగుమతి పైన ఆధారపడ్డాయి. ఇకముందు నుండి ప్రవేటు సంస్థల్ని ప్రోత్సహిస్తామనీ అయన తెలిపారు. భారత్‌- ఫ్రాన్స్‌ దేశాల మధ్య ద్వేపాక్షిక సంబంధాలు రోజురోజుకీ బలపడుతున్నాయని  ఫ్రాన్స్‌ రాయబారి ఫ్రాంకోయిన్‌ తెలియజేశారు.