రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

రాజమండ్రి: విజయవాడ నుంచి వైజాగ్‌ వెళ్తున్న రత్నాచల్‌  ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు వ్యాపించాయి. డి-2 బోగిలో పొగలను గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారమందించారు. దీంతో బిక్కవోటు స్టేషన్‌లో అధికారులు రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అయితే గంటకు పైగా రైలును స్టేషన్‌లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.