రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలి: మత్రి కన్నా

హైదరాబాద్‌: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఎస్సారెస్పీ, కేసీ కెనాల్‌, కృష్ణా డెల్లా కింద నీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రితో చర్చిస్తానని ఆయన చెప్పారు.