రమణాచారిని కలిసిన ఆలయ చైర్మన్
మల్దకల్ఆగస్టు 27 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారిని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయ ఈవో పురంధర్ కుమార్ శనివారము హైదరాబాదులోని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేశారు. మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయం అపర తిరుపతిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు ఉంటాయని రమణాచారి వారికి తెలిపారు. ఈ సందర్భంగా మల్దకల్ తిమ్మప్ప స్వామి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి చిత్రపటాలను ప్రసాదాలను రమణాచారికి అందజేశారు.