రవాణశాఖ అధికారిని బస్సు తో ఢీ కొట్టడానికి యత్నించిన డ్రైవర్‌

నల్గొండ : చిట్యాల, రామన్నపేట దారిలో పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ఎంవీఐ శాస్త్రీని ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌ బస్సుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితి గమనించిన ఆయన పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇతని పై అధికారి ఫిర్యాదు మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. డ్రైవరు పరారీలో ఉన్నాడు. జిల్లా వ్యాప్తంగా జరిగిన దాడులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మొత్తం 11 పాఠశాల బస్సులను సీజ్‌ చేశామని నల్గొండ ఆర్డీఓ హన్మంతరెడ్డి తెలిపారు.