రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి .
15 రోజుల క్రితం కుంటల విహార యాత్ర కు వెళ్ళేటప్పుడు ఖానాపూర్ లో వాళ్ళు ప్రయాణిస్తున్న tata మ్యాజిక్ పై చెట్టు పడి ప్రమాదవసాత్తు మరణం చెందిన వూట్నూరి రవి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి గారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో జరిగిన #విహారయాత్ర #విషాదయాత్రగా మారిన సంఘటన అందరినీ దుఃఖ సాగరం లో ముంచి వేసింది, అభం శుభం తెలియని చిన్న పిల్లలకు తండ్రిని దూరం చేసింది, ఈ సంఘటన తలుచుకొని బాధ పడని వారు ఉండరు…
ఈరోజు జగిత్యాలకు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు మరియు చిన్న పిల్లల వైద్యులు(అరుణ హాస్పిటల్) డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి గారు ఇటిక్యాల వెల్లి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు, పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా సంప్రదించ మని అన్నారు.
ఈ సందర్బంగా దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సభ్యులు అంతా కలిసి జమ చేసిన 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, ఉప సర్పంచ్ కడార్ల చంద్రశేఖర్, ఎంపీటీసీ కొమ్ముల రాధా ఆదిరెడ్డి, వార్డ్ మెంబర్ జలెందర్ రెడ్డి, వార్డు మెంబర్ సిరికొండ రాజు, పెద్దలు కాటిపెల్లి గంగారెడ్డి గారు, దీకొండ రాజశేఖర్, వూట్నూరి హమ్మండ్లు, గంగాధర్ మరియు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నరసింహుని పేట సర్పంచ్ బాబుస్వామి, సౌదీ అరేబియా ఇంచార్జీ శేకర్ LD, కిషన్ పీసరి, సతీష్ మండలోజి, గాండ్ల అంజిత్, సాగర్ గడ్డం, రాజేష్ భూముల, రాజేష్ పొట్టవతిని, కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం చేసిన వారు, రవి వూట్నూరి, బాలు బొమ్మిడి, రమేష్ చిలుముల, సతీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ మల్యాల , గణేష్ పింజారా, లక్ష్మి రాజం ఏనుగంటి, జంగం అశోక్, రవి డేవిడ్, మల్లన్న కట్టకింది, లింగన్న బొడ్డిపెల్లి, శేఖర్ LD, కొత్త రవి, సురేష్ పటేల్, వినోద్ చిలూముల, నరేష్, రాజేశ్వర్ దార్ల, రవీందర్ వేములవాడ, భారత్ రెడ్డి, మహేష్ మార్గం, చంద్రభూసన్.