రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం
` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం
` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు
` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం
` బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు
` కంటోన్మెంట్‌లో 20 వేల మెజార్టీ సాధిస్తున్నాం
` మీడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిశాయని… ఇక తన దృష్టి అంతా పరిపాలన పైనే అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎలక్షన్‌ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్‌ ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగళవారం విూడియాతో చిట్‌చాట్‌ చేశారు.ఎవరి ఓట్లు నేతలు తీసుకుంటే ఎలక్షన్‌ అంచనా వేయొచ్చని అన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ 20 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం విూద 210 ఎంపీ సీట్లు కూడా దాటేలా లేదన్నారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ సరళిపై మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్‌ మెరుగైందని, కాంగ్రెస్‌ అభ్యర్థికి కనీసం 20వేల మెజార్టీ వస్తుందన్నారు. ఆరేడు స్థానాల్లో భారాసకు డిపాజిట్లు కూడా రావు. మెదక్‌లో భాజపా మూడో స్థానంలోకి వెళ్లింది. ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసి ఉంటే అంచనా వేయడం సులువు. భారాస శ్రేణులు పూర్తి స్థాయిలో భాజపాకు పనిచేశాయి. భాజపాకు ఇవాళ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకుంటే 13 స్థానాలు వస్తాయని సమాచారం ఉంది. ఇంతటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయి. ఇప్పటినుంచి పరిపాలనపై దృష్టి ఉంటుందన్నారు. రేపటి నుంచి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెడుతామన్నారు. ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామని వివరించారు. స్కూళ్లు ఓపెన్‌ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడుతామని అన్నారు. రుణమాఫీ కోసం ఎఫ్‌ఆర్బీఎం పరిధిలో లోన్‌ తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయం ముగిసిందని.. రాష్ట్రంలో తన దృష్టి పూర్తిగా పరిపాలనపైనే పెడుతానని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు ఏం అనుకున్న తాను పట్టించుకొనని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని.. ఇప్పుడు రైతు బంధు నిధులు వేశాక మా క్రెడిట్‌ అని చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని… లేదంటే అఖిలపక్షం పెడుతామని చెప్పారు. రేషన్‌ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని స్పష్టం చేశారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామన్నారు. రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని హావిూ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని మాటిచ్చారు. స్టేట్‌కు ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, సమస్యలు, విద్యా సంవత్సరం మొదలుకానుంది, సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫామ్‌ తదితర అంశాలపై సవిూక్ష చేస్తా. ఫార్మర్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దానికి ఆదాయం సమకూర్చుతాం. దాని ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. రేషన్‌ దుకాణాల ద్వారా గతంలో మాదిరి ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు ఇస్తాం. ఏయే వస్తువులు ఇవ్వొచ్చో పరిశీలించి నిర్ణయిస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. కాగా ఈ క్రమంలోనే రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సవిూక్షిస్తానని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్నబియ్యంపై అధికారులను ఆరా తీస్తానని వెల్లడిరచారు. ఫార్మర్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామన్న సీఎం, కార్పొరేషన్‌ ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 6 నాటికి రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామన్న ఆయన, రేషన్‌ దుకాణాల ద్వారా ఎక్కువ వస్తువులను తక్కువ ధరకు ఇస్తామన్నారు.’మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోలేం. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తాం. ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రేషన్‌కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదు, అది నిరంతర ప్రక్రియ. కార్పొరేట్‌ విద్య, వైద్యంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సి ఉంది. విద్యుత్‌ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉంది. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తా. ఎన్నికల ముందు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్లలేదు. అత్యవసర అంశాలపై నిర్ణయాలకు నియమావళి అడ్డురాదు. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం కానుంది.’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.