రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు నోటీసులు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఐటీ శాఖ ఆప్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు బీజేపీ నోటీసులు జారీ చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆప్‌కు నోటీసుల జారీ వెనుక రాజకీయ కారణాలు ఏం లేవు అని బీజేపీ స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టమెంట్ తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ తెలిపింది.